Janasena: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరగబోతున్నాయి. అయితే, ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అధికార వైసీపీకి వరుస షాక్‌లు తగులున్నాయి.. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆశావహులు, వైసీపీ నేతలు ఇలా.. సీట్ల కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. ఇక, విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీ పార్టీ మారారు. ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు.
Read Also: IND vs SA: రాణించిన రాహుల్.. 245 పరుగులకు టీమిండియా ఆలౌట్..
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వంశీతో నాకు 2009 నుంచే పరిచయం ఉంది.. ప్రజా రాజ్యం యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి వంశీతో నాకు పరిచయం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీగా ఉండి కూడా వంశీ జనసేనలోకి వచ్చిన ఆయనని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.. వంశీ తన సొంతింటికి వచ్చారు.. ఆయన పార్టీలోకి వచ్చిన విధానం నాకు నచ్చింది.. వంశీ ఏ నమ్మకంతో జనసేనలోకి వచ్చారో.. ఆ నమ్మకం కొల్పోకుండా పార్టీ అండగా ఉంటుంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. వంశీని నేనో నియోజకవర్గం దృష్టిలో నేను చూడడం లేదు.. వంశీ వంటి నేతలు రాష్ట్రానికి అవసరం.. వంశీకి చాలా బలంగా పార్టీ అండగా ఉంటుంది అనవ పవన్ పేర్కొన్నారు.
