మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నాం అని వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం పేర్కొన్నారు. ఏబీవీ అహంకారంతో తలతిక్కగా ప్రవర్తిస్తున్నారని, కుల అహంకారంతో ప్రవర్తిస్తే మిగతా కులాలు తిరగబడతాయని తెలుసుకోవాలన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ రెడ్డిలు ఏనాడు కులం కోసం పని చెయ్యలేదని.. కుల, మతాలకు అతీతంగా పనిచేశారు కాబట్టే 40 శాతం ఓట్లు సాధించారన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని తలసిల రఘురాం డిమాండ్ చేశారు.
‘ఏబీ వెంకటేశ్వరరావు మాజీ సీఎం జగన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు కుల జాఢ్యానికి నిదర్శనం. వైసీపీ తరఫున ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఏబీవీ అహంకారంతో తలతిక్కగా ప్రవర్తిస్తున్నారు. కుల అహంకారంతో ప్రవర్తిస్తే మిగతా కులాలు తిరగబడతాయని తెలుసుకోవాలి. వైయస్సార్, వైఎస్ జగన్ ఏనాడు కులం కోసం పని చెయ్యలేదు. కులమతాలకు అతీతంగా పనిచేశారు కాబట్టే 40 శాతం ఓట్లు సాధించారు. ఏబీవీ తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను కమ్మ కులం మొత్తానికి అపాదించడం ఏంటి?, ఏబీవీ భాష గొడ్లు కాసేవారి భాషలా ఉంది. కమ్మ అధికారులు అందరూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టారు. పవన్ కళ్యాణ్ ఏబీవీ వ్యాఖ్యలపై స్పందించాలి. లేదంటే పవన్ కూడా కమ్మ కులానికి మద్దతిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తారు’ అని ఎమ్మెల్సీ తలసిల రఘురాం అన్నారు.