NTV Telugu Site icon

MLC Sheikh Sabji: నేను నిరపరాదిని…….హైకోర్టుకెళతా

Ttd1mlc

Ttd1mlc

టీటీడీ దర్శన టికెట్ల కుంభ‌కోణంలో టీచ‌ర్స్ ఎమ్మెల్సీ షాక్ సాబ్జీ టీటీడీ విజిలెన్స్ అధికారుల‌కు ప‌ట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ విష‌యం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ త‌ర‌పున షేక్ సాబ్జీ రెండేళ్ల క్రితం గెలుపొందారు.బ్రేక్ దర్శన టికెట్లను అమ్ముకున్న విష‌యాన్ని గ్రహించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆయ‌న‌పై కేసు న‌మోదుకు రెడీ అయ్యారు. ఈ నెల‌లో 19 సిఫార్సు లేఖ‌ల‌ను ఎమ్మెల్సీ పంప‌గా, టీటీడీ ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని బ్రేక్ ద‌ర్శన భాగ్యాన్ని క‌ల్పించింది. ఇవాళ ఏకంగా 14 మంది భ‌క్తుల‌ను వెంట‌బెట్టుకుని ఆయ‌న తిరుమ‌ల ద‌ర్శనానికి వెళ్లారు. అలాగే ఇదే నెల‌లో ఆయ‌న మూడు సార్లు తిరుమ‌ల‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా స్వామివారిని ద‌ర్శనం చేసుకున్నారు.

Read Also:Pet Dog: కుక్క యజమాని బొటనవేలును కొరికేసింది.. అదే అతడికి వరమైంది!

ఎమ్మెల్సీ ఇచ్చిన సిఫారసు లేఖలపై నిఘా పెట్టారు అధికారులు. ఈ సందర్భంగా పలు విభ్రాంతికరమయిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇవాళ దర్శనానికి వచ్చిన 14 మంది భ‌క్తుల‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారించారు. తామంతా క‌ర్నాట‌క వాసులుగా చెప్పారు. హైద‌రాబాద్‌కు చెందిన వారిగా ఆధార్‌లో ట్యాంప‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్టు గుర్తించారు. ద‌ర్శ‌నానికి సంబంధించి ఎమ్మెల్సీ డ్రైవ‌ర్ ఖాతాకు రూ.1.05 ల‌క్ష‌ల‌ను భ‌క్తులు బ‌దిలీ చేసిన‌ట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. బ్రేక్ దర్శన టికెట్లను అమ్ముతున్నారని విజిలెన్స్ తేల్చింది. ఇది తీవ్రమైన నేరంగా భావించిన టీటీడీ కేసు న‌మోదుకు రెడీ అయింది. అక్రమాలకు పాల్పడే వ్యక్తలు ఎవరైనా వారిపై కఠినచర్యలు తప్పవన్నారు ఈవో ధ‌ర్మారెడ్డి. ఇందుకు ఎమ్మెల్సీపై కేసు న‌మోదే ఉదాహ‌ర‌ణగా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. తాను నిరపరాదినన్నారు ఎమ్మెల్సీ షేక్ షాబ్జి.

రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మేరకు దేశంలో ఏ ప్రాంతంలో వున్న వారినైనా నేను దర్శనానికి తీసుకువెళ్ళే హక్కు నాకు వుంది. ఆథార్ కార్డులు ఫోర్జరి చెయ్యవలసిన అవసరం నాకు లేదు. కుట్రపూరితంగా నా పై కేసు నమోదు చేసారు. ఈ వ్యవహారం పై హైకోర్టును ఆశ్రయిస్తాను అన్నారు. విజిలెన్స్ వారు చెప్పేదానికి ….వాస్తవాలకు సంబంధం లేదన్నారు. ఆథార్ కార్డు ఫోర్జరి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని నేనే పోలీసులును కోరినా. అయితే, వారు కేసు నమోదు చేయడం లేదు. నాతో దర్శనానికి వచ్చిన రవింద్ర అనే భక్తుడు వద్ద సంతకాలు తీసుకోని నాపై తప్పుడు కేసు నమోదు చేసారు. 32 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో నేను ఏనాడూ తప్పు చెయ్యలేదు. నా పేరుతో చిల్లిగవ్వ కూడా లేదన్నా షేక్ షాబ్జీ.

Read Also:Shreyas Iyer: టీమిండియాకు గుడ్ న్యూస్.. శ్రేయస్ సర్జరీ సక్సెస్