MLC Kaviha Leaves Hyderabad to US: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు పయనం అయ్యారు. శనివారం ఉదయం పెద్ద కుమారుడు ఆదిత్య, చిన్న కుమారుడు ఆర్యతో కలిసి అమెరికాకు బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కవిత భర్త అనిల్, కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి నాయకులు సెండాఫ్ ఇచ్చారు. చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు కవిత అమెరికా వెళుతున్నారు. 15 రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉండనున్నారు. ఎమ్మెల్సీ కవిత సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
Also Read: Uppal Boy Murder: కమర్ పిల్లలతో రోజు ఆడుకునే వాడు.. బాబుకి బిస్కెట్ల ఆశ చూపించి..!
అమెరికా పర్యటన నేపథ్యంలో తండ్రి కేసీఆర్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్సీ కవిత ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌కు శుక్రవారం వెళ్లారు. చిన్న మనువడు ఆర్యను కేసీఆర్ ఆశీర్వదించారు. ఇక కవిత అమెరికా పర్యటనకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఇప్పటికే అనుమతించిన విషయం తెలిసిందే. అమెరికాకు వెళ్లేందుకు అనుమతి కావాలంటూ.. రౌస్ అవెన్యూ కోర్టును కవిత ఆశ్రయించారు. కోర్టు ఆమె పాస్‌పోర్టును రిలీజ్ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను 2024 మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఐదు నెలల జైలు శిక్ష అనంతరం షరతుల మీద బెయిల్ మంజూరైంది. ఆ సమయంలో కవిత తన పాస్‌పోర్టును రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించారు.
@RaoKavitha గారు తన చిన్న కుమారుడు ఆర్య పైచదువుల కోసం అమెరికాకు ప్రయాణం#KavithaKalvakuntla #Jagruthi #usa #kavithason #airport @OfficeOfKavitha @BRSparty pic.twitter.com/wUlqsWIc9z
— Munna_BRS (@MUNNA_BRS) August 16, 2025
