NTV Telugu Site icon

MLC Kavitha: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కవిత కౌంటర్‌

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: బీజేపీ నేత రాజగోపాల్‌ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్‌ అన్న తొందరపడకు, మాట జారకు అంటూ కవిత ట్వీట్‌ చేశారు. ఈడీ ఛార్జిషీట్‌లో 28 సార్లు తన పేరు చెప్పించినా.. 28 వేల సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాదని ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్‌ చేసిన సమీర్‌ మహేంద్రు కేసులో దాఖలు చేసిన 3000 పేజీల ఛార్జిషీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి కవితను ఉద్దేశిస్తూ లిక్కర్‌ క్వీన్‌ చేసిన ట్వీట్‌కు ఆమె స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు.

Delhi Liquor Scam: ఈడీ ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు

అసలేం జరిగిందంటే.. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లను చేర్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు, పి.శరత్‌చంద్రారెడ్డి, బినయ్‌బాబు, విజయ్ నాయర్, బోయినపల్లి అభిషేక్‌ల నుంచి తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా ఈ ఛార్జిషీట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ రూపొందించింది. కవిత వాడిన 10 మొబైల్‌ ఫోన్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఎమ్మెల్సీ కవితతో పాటు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, ముత్తా గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్‌ల పేర్లను చేర్చింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఛార్జిషీట్‌లోని కీలకాంశాలు తాజాగా లీకయ్యాయి.