Site icon NTV Telugu

MLC Kavitha Resignation: ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా!

Mlc Kavitha Resignation

Mlc Kavitha Resignation

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు కల్వకుంట్ల కవిత అధికారికంగా ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు.

నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో 2022లో ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఎన్నికయ్యారు. 2022-2028 వరకు కవిత పదవీ కాలం ఉంది. మరో రెండున్నర సంవత్సరాల పదవీ కాలం మిగిలి ఉండగానే రాజీనామా చేశారు. తాను ఏ పార్టీలో చేరను అని, ఏ పార్టీతోనూ తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. జాగృతి కార్యకర్తలు, మేధావులతో చర్చించాకే భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని చెప్పారు.

 

Exit mobile version