MLC Kavitha: దర్యాప్తు సంస్థలు మహిళలను కార్యాలయానికి పిలవకుండా వారి ఇంట్లోనే విచారించాలనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన నోటీసులను కవిత గతేడాది సవాల్ చేశారు. ఈడీ అధికారులు జారీ చేసిన నోటీసులపై అభ్యంతరం తెలుపుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఆమె పిటిషన్‌ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో జత చేసిన సంగతి తెలిసిందే. కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేకంగా విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు శుక్రవారం జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం పేర్కొంది.
Read Also: Kishan Reddy: కేసీఆర్ ప్రభుత్వం వల్లే తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైంది..