Site icon NTV Telugu

MLC Kavitha : సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్

Kavitha Mlc

Kavitha Mlc

తీహార్ జైలులో ఈ ఉదయం ఎమ్మెల్సీ కవిత తో ములాఖాత్ అయ్యారు కేటీఆర్ , హరీష్ రావు. సుప్రీం కోర్టులో వేయనున్న బెయిల్ పిటీషన్ పై ఢిల్లీలో న్యాయ నిపుణుల బృందంతో కేటీఆర్, హరీష్ చర్చిస్తున్నారు. సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. బెయిల్ పిటిషన్ వేసే దాకా ఢిల్లీలోనే ఉండి… న్యాయవాదుల బృందంతో సమన్వయం చేయనున్నారు కేటీఆర్, హరీష్. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు ఈ రోజు ఉదయం ములాఖాత్ అయ్యారు.. ఆమెతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని కోరారు.. న్యాయవ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉందని, త్వరలోనే బెయిల్ లభిస్తుందని ఇరువురు భరోసా వ్యక్తం చేశారు. హైకోర్టు ఎమ్మెల్సీ కవిత బెయిల్ అభ్యర్థన తిరస్కరించిన నేపథ్యంలో…సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ.

Exit mobile version