Site icon NTV Telugu

MLC Kavitha: మహిళల కోసం కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారు..

Kavihta

Kavihta

తెలంగాణ భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రాజకీయంగా మహిళలు నష్టపోతున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టిన కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లు అమలుకానందు వల్ల మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యాణా వంటి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. జనగణనకు బడ్జెట్‌లో ఎందుకు నిధులు పెట్టలేదు..? అని ప్రశ్నించారు. త్వరగా జనగణన చేస్తే.. రాబోయే బిహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలవుతారని కవిత పేర్కొన్నారు.

Read Also: Nadendla Manohar: రాజకీయాల్లో మహిళలు మరింతగా ఎదగాలి..

రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. ప్రతీ మహిళకు రూ.2500 ఇస్తామన్న హామీని అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని తెలిపారు. మరోవైపు.. మహిళా సంఘాల ద్వారా అద్దెకు తీసుకుంటున్న బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలని అన్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచకపోవడం సరికాదని తెలిపారు. మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వం బహిర్గతం చేయాలని కవిత కోరారు.

Read Also: 14 DaysGirlFriendIntlo : ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ చిత్రానికి దర్శక దిగ్గజాల విషేష్

కేసీఆర్ మహిళా కేంద్రీకృత పాలన చేశారు.. మహిళల కోసం కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారని కవిత అన్నారు. కేరళ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో మహిళా, పురుషల సమానత్వపు బొమ్మలు ప్రచురిస్తున్నారు.. అలాంటి చర్యలు తెలంగాణలో కూడా రావాల్సి ఉందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం, నిర్ణయాధికారం రావాల్సి ఉందన్నారు. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని వెల్లడించారు. చిట్యాల ఐలమ్మ, రాణి రుద్రమాదేవి వంటి వీర మహిళలు తెలంగాణ గడ్డపై పుట్టడం మనకు గర్వకారణం అని ఎమ్మె్ల్సీ కవిత తెలిపారు.

Exit mobile version