అయోధ్యలో సోమవారం జరగనున్న శ్రీరాముని విగ్రహం ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత రాష్ట్ర సమితికి అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఆదివారం వెల్లడించారు. ఫలితంగా, ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం ఉండదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు బీజేపీ చెబుతున్న నేపథ్యంలో, ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని కవిత మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే, శ్రీరాముడు ఒక వ్యక్తికి లేదా సంస్థకు చెందినవాడు కాదని, అందరికీ చెందినవాడని ఆమె గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ పవిత్ర స్థలాలను సందర్శిస్తారని చివరికి ఆయన దర్శనం కోసం వారు అయోధ్యను సందర్శిస్తారని ఆమె చెప్పారు.
ఇక అయోధ్య రామ మందరి ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందిందా లేదా అనేది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసుకుంది. దేశ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి అయిన కేసీఆర్‌కు తప్పకుండా ఆహ్వానం అందే ఉంటుందని.. అయితే ఆయన ఆరోగ్యం సరిగా లేనందున పార్టీ నుంచి ఎవరో ఒకరు హాజరయ్యే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపించాయి.
కాగా, కేసీఆర్‌కు ఆహ్వానం విషయమై తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు. అయోధ్య టెంపుల్ ట్రస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం అందలేదని చెప్పారు. అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని అన్నారు. అయినా.. రాముడు అందరివాడని.. కొందరివాడు కాదని చెప్పారు. ఏదో ఒక సందర్భంలో తప్పకుండా అయోధ్యను విజిట్ చేసే అవకాశం తప్పకుండా వస్తుందని చెప్పారు. అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించుకున్నట్లే.. ఏదో ఒక రోజు అయోధ్యను కూడా సందర్శించే భాగ్యం తమకు కలుగుతుందని అన్నారు. రేపు జరిగే కార్యక్రమానికి ఎలాంటి అధికారిక ఆహ్వానం లేనందున వెళ్లలేకపోతున్నామని కవిత వెల్లడించారు.
