MLA Sanjay Kumar: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్
- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ ఫైర్
- పార్టీ ఫిరాయించానని జీవన్ రెడ్డి పదేపదే అనడం సరికాదన్న ఎమ్మెల్యే
- కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు సంజయ్ కుమార్ తెలిపారు. కానీ తాను పార్టీ ఫిరాయించానని జీవన్ రెడ్డి పదేపదే అనడం సరికాదన్నారు. అయినప్పటికీ తాను ఇంకా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా కూడా చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గంగారెడ్డి హత్య బాధాకరమని.. తీవ్రంగా ఖండించారు. ఈ హత్యను సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన జీవన్ రెడ్డి రాజకీయం చేయడం బాధాకరమని..దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాన్నారు.
READ MORE: Prabhas Hanu: రిలాక్స్ బాయ్స్.. ప్రభాస్-హను మూవీ లేటెస్ట్ అప్డేట్ ఇదే!
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
గంగారెడ్డి హత్యకేసులో తన పక్కనున్నవారితో నా హస్తమున్నదని జీవన్ రెడ్డి మాట్లాడించడం చాలా దురదృష్టకరమని.. ఇవాళ ఫిరాయింపుల రాజకీయాల గురించి మాట్లాడుతున్న జీవన్ రెడ్డిది ఎలాంటి చరిత్రో అందరికీ తెలుసని తీవ్రంగా విమర్శించారు. నాడు కాంగ్రెస్ ను తిడుతూనే రాజకీయాల్లోకి వచ్చిన చరిత్ర జీవన్ రెడ్డిదన్నారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉండి.. నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి మళ్లీ పార్టీ ఫిరాయించి, ఎన్టీఆర్ ను ఏకాకిని చేశారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం రాక ముందు నుంచే తాము కాంగ్రెస్ వాదులమని.. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు కేంద్ర బిందువు తమ ఇల్లని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే జగిత్యాల అభివృద్ధి చెందుతుందనేదే తన యోచన అని స్పష్టం చేశారు.
READ MORE:PM Modi: ఉగ్రవాదంపై దేశాలు కలిసి పోరాడాలి.. బ్రిక్స్ సదస్సులో మోడీ పిలుపు
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!