NTV Telugu Site icon

MLA Sanjay Kumar: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్

Mlc Mla

Mlc Mla

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు సంజయ్ కుమార్ తెలిపారు. కానీ తాను పార్టీ ఫిరాయించానని జీవన్ రెడ్డి పదేపదే అనడం సరికాదన్నారు. అయినప్పటికీ తాను ఇంకా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా కూడా చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గంగారెడ్డి హత్య బాధాకరమని.. తీవ్రంగా ఖండించారు. ఈ హత్యను సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన జీవన్ రెడ్డి రాజకీయం చేయడం బాధాకరమని..దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాన్నారు.

READ MORE: Prabhas Hanu: రిలాక్స్ బాయ్స్.. ప్రభాస్-హను మూవీ లేటెస్ట్ అప్డేట్ ఇదే!

గంగారెడ్డి హత్యకేసులో తన పక్కనున్నవారితో నా హస్తమున్నదని జీవన్ రెడ్డి మాట్లాడించడం చాలా దురదృష్టకరమని.. ఇవాళ ఫిరాయింపుల రాజకీయాల గురించి మాట్లాడుతున్న జీవన్ రెడ్డిది ఎలాంటి చరిత్రో అందరికీ తెలుసని తీవ్రంగా విమర్శించారు. నాడు కాంగ్రెస్ ను తిడుతూనే రాజకీయాల్లోకి వచ్చిన చరిత్ర జీవన్ రెడ్డిదన్నారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉండి.. నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి మళ్లీ పార్టీ ఫిరాయించి, ఎన్టీఆర్ ను ఏకాకిని చేశారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం రాక ముందు నుంచే తాము కాంగ్రెస్ వాదులమని.. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు కేంద్ర బిందువు తమ ఇల్లని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే జగిత్యాల అభివృద్ధి చెందుతుందనేదే తన యోచన అని స్పష్టం చేశారు.

READ MORE:PM Modi: ఉగ్రవాదంపై దేశాలు కలిసి పోరాడాలి.. బ్రిక్స్ సదస్సులో మోడీ పిలుపు