NTV Telugu Site icon

Jeevan Reddy: కేంద్రం మన్మోహన్ సింగ్‌ను భారత రత్నతో గౌరవించాలి..

Jeevanreddy

Jeevanreddy

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం భారత రత్నతో గౌరవించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టింది మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఏక మొత్తంలో రైతుల రుణాలు మాఫీ చేసింది ఆయనేనని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఉపాధి కలుగుతుంది అంటే అది.. పారదర్శకతకి సమాచార హక్కు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్‌కి దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి మార్గం సుగమం చేసింది ఆయనే.. తెలంగాణతో ఆయనకు ఎంతో అనుబంధం ముడిపడి ఉందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మెట్రో రైల్ మొదటి దశ పూర్తి చేసుకున్నాం అంటే మన్మోహన్ సింగ్ క్రెడిట్ అని కొనియాడారు.

Read Also: Kichcha Sudeep: ప్రభాస్‌ వ్యక్తిత్వం పై కన్నడ హీరో కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్‌లో ఐటీ ఖ్యాతి పెంచడం.. తెలంగాణ బిల్లులు విద్యుత్ కేటాయింపులో కూడా మన్మోహన్ సింగ్ సూచనలే ఎక్కువ అని జీవన్ రెడ్డి తెలిపారు. ఆయన సేవలు శాశ్వతంగా గుర్తించుకునేలా ఉన్నాయి.. నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు ఒక్కొక్కరు ఒక్కో రంగంలో దేశాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. మన్మోహన్ సింగ్‌ని గౌరవించడం అంటే.. పీవీని గౌరవించడమేనని తెలిపారు. మన్మోహన్ సింగ్ సేవలు గుర్తించింది పీవీ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.

Read Also: Elon Musk vs Trump: భారతీయ వలసదారులపై ట్రంప్, మస్క్ మద్దతుదారుల మధ్య విభేదాలు..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.. భారత దేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు వయసు 92 ఏళ్లు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇతర నేతలు, బంధువులు ఆయనకు నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో సిక్కు సంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Show comments