జగిత్యాల జిల్లా కేంద్రంలోని 25 వ వార్డ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ రాజకీయ నాయకుడు గొప్పవాడు కాదు లక్ష్యం గొప్పది ఆశయం గొప్పది.. సీఎం కేసీఆర్ లేకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లేదు అని అనడం ఆయన అహంకారానికి నిదర్శనం.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగుల పాత్ర కీలకం అని ఆయన తెలిపారు.
తెలంగాణ, రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగుల ఆత్మ బలిదానాలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ ఒక భాగం మాత్రమే.. రాజకీయాల్లో భౌతికదాడులతో ఎవరికి లబ్ధి జరగదు.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి రాజకీయ పార్టీ కుట్ర అయితే ఆ పార్టీకి నష్టం జరుగుద్ది అని ఆయన పేర్కొన్నారు. ఎంపీపై దాడి ఏ పరిస్థితిలో చేశాడో వాస్తవాలు విచారణలో బయటకు వస్తాయి.. నా కార్యకర్తలకు ఒక్కటే చెప్తాను ఎవరైనా ఏదైనా అంటే ఓపిక పట్టండని అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు.
Read Also: Shaheen Shah Afridi: పాక్ ఫాస్ట్ బౌలర్ సరికొత్త రికార్డు.. వన్డే చరిత్రలోనే..!
అయితే, నిన్న దుబ్బాకలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేస్తుండగా రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలతో గజ్వేల్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసిన తర్వాత.. హైదరాబాద్ లోని యశోదా హస్పటల్ కు తరలించారు.. అక్కడ డాక్టర్లు దాదాపు నాలుగు గంటల పాటు సర్జరీ చేసి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.