NTV Telugu Site icon

Jeevan Reddy : ప్రీతి కేసులో.. సిట్ విచారణ.. సిట్టింగ్ జడ్జితో జరపాలి

Jeevanreddy

Jeevanreddy

వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఆమె నిన్న రాత్రి ప్రీతి మరణించింది. ఆమె స్వగ్రామంలో నేడు ప్రీతి అంత్యక్రియలు జరుగుతున్నాయి. అయితే.. ప్రీతి మృతిపై విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. సైఫ్ వేధింపులపై తండ్రి ఫిర్యాదు చేయగానే విచారణ జరిపితే సమస్య వచ్చేది కాదన్నారు. హెచ్‌ఓడీ ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ చేయడం ఏంటని ఆయన అన్నారు. సైఫ్‌ని హెచ్చరిస్తే సమస్య తీవ్రత తగ్గేదని, నిందితుడితో పాటుగా.. పోలీస్ అధికారి.. కళాశాల ప్రిన్సిపాల్, హెచ్‌ఓడీని కూడా సహనిందితుడిగా చేర్చాలన్నారు జీవన్‌ రెడ్డి. సిట్ విచారణ.. సీట్టింగ్ జడ్జితో జరపాలన్నారు. రక్షిత అనే అమ్మాయి కూడా వేధింపులతో చనిపోయిందని, భూపాలపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసినా.. పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుందన్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Also Read : Vostro Accounts: విదేశాలతో రూపాయల్లో వాణిజ్యానికి వోస్ట్రో అకౌంట్లు ఎలా పనిచేస్తాయి?

జరుగుతున్న ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మూడు నెళ్లలోనే విచారణ పూర్తి చేసి.. శిక్ష వేస్తేనే న్యాయమని ఆయన అన్నారు. నవీన్ హత్య కేసు కూడా ప్రత్యేక విచారణ అధికారిని నియమించాలని ఆయన కోరారు. సోనియా గాంధీ రాజకీయాల నుండి విరమించుకోలేదని, అధ్యక్షురాలిగా టర్మ్ ముగిసే సందర్భంలో భారత్ జోడోని ఉద్దేశించి కామెంట్స్‌ చేశారంతేనన్నారు.

Also Read : Chigurupati Jayaram : చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నేడు నాంపల్లి కోర్టు తీర్పు

బీఆర్‌ఎస్‌ దేశవ్యాప్తంగా రాజకీయం చేస్తా అన్నారని, కానీ లిక్కర్ కేసు దేశ వ్యాప్తం చేశారని, ఢిల్లీకి కూడా అంటించారన్నారు. అవినీతి సొమ్ము జీర్ణించుకోవడం సిసోడియాకి తెలియదని, మన వాళ్లకు అది అలవాటు అన్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్లంతా ఎవరు అనేది చూడాలని, సౌత్ వింగ్ మూలాల ఎక్కడ అనేది తేలాలన్నారు.