కేటీఆర్, బండి సంజయ్‌లపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాను ఏ విధంగా గౌరవించాలో కేటీఆర్ నేర్చుకోవాలని అన్నారు. బండి సంజయ్ కేంద్రమంత్రి హోదాలో ఉండి ఇన్వెస్ట్‌గేట్ ఏజెన్సీని అవమానిస్తున్నాడని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూపొందించిన ధరణిలో ఉన్న సమస్యలకు పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చారని అన్నారు. సంక్రాంతి కానుకగా భూభారతిని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశామని జీవన్ రెడ్డి తెలిపారు. భూభారతి చట్టాన్ని ఆమోదించినందుకు గవర్నర్‌కు ధన్యవాధాలు చెప్పారు.
Read Also: Greenland: గ్రీన్‌ల్యాండ్‌ని కొనేందుకు ట్రంప్ ప్లాన్.. వాస్తవానికి ఆ ద్వీపం ఏ దేశానికి చెందినదంటే ?
ధరణి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. భూభారతిలో ఆపిల్ చేసుకొనే అవకాశం ఉంది.. సాగు కాలం కూడా పెట్టారని అన్నారు. రెవిన్యూ కోర్టు ఏర్పాటు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణిలో ఇవి ఏవి లేవని అన్నారు. గత ప్రభుత్వంలో వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థ లేకుండా పోయింది.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ వస్తుందని పేర్కొన్నారు.
Read Also: Lovers Suicide: సంగారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య..