Site icon NTV Telugu

MLC Jeevan Reddy: సీఎం కేసీఆర్ చీకట్లోకి వెళ్లిపోయారు..

Jeevan Reddy

Jeevan Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 15 రోజులుగా చీకట్లోకి వెళ్ళిపోయారు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలన చూస్తే తెలంగాణ ఎందుకు వచ్చిందని బాధగా అనిపిస్తుంది.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంగంట్లో అమ్మకానికి పెట్టిన సరకుగా మారింది.. రాష్ట్రంలో భార్యాభర్తలు కలిసి సంసారం చేయలేకపోతున్నారు.. కేసీఆర్ కి నైతికత ఉంటే సీఎం పదవి నుండి తప్పుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటుంది.. మెగా డీఏఎస్సీ కోసం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: NTR: వచ్చే ఏప్రిల్ లో ఎన్టీఆర్ రెండు విధ్వంసాలని సృష్టించబోతున్నాడు

తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పాత్ర గొప్పది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఉద్యమకారులను వివక్షకు గురిచేయడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి.. కేవలం 5 శాతం ఐఆర్ నిర్ణయాన్ని ప్రభుత్వం పున:పరిశీలించాలి అని ఆయన చెప్పారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 20 శాతం ఐఆర్ ప్రకటించాలి అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన మూడు పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ ఉంటుంది అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పాలన నుంచి విముక్తి పొందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు.

Exit mobile version