రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరా లు ఏర్పాటు చేయాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే హై కోర్టు అనుమతి ఉన్న షర్మిల పాదయాత్రను అడ్డుకోవడంలో పోలీసుల అతి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అంతేకాకుండా.. మెదక్ ఖదీర్ ఖాన్ కేసులో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం మానవ హక్కుల ఉల్లంఘనే అని ఆయన మండిపడ్డారు.
Also Read : Today (20-02-23) Stock Market Roundup: ఏడు శాతం పడిపోయిన CIPLA షేర్లు
పోలీసుల సస్పెండ్ అనేది ఖదీర్ మృతికి ఒక ఆధారమని, తక్షణమే సిట్టింగ్ జడ్జితో హై కోర్టులో విచారణ చేపట్టాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఆర్థిక సాయం అందించాలని, పోలీసులు సమాజానికి జవాబు దారులని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగిత్యాల నర్సింగాపూర్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు విషయంలో పోలీస్ డిపార్ట్ మెంట్ ఎందుకు నిర్లక్యం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. నిందితుడు న్యాయవాది వృత్తిలో ఉన్నాడు సభ్య సమాజం దీనిని తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ఇప్పటి వరకు నిందుతున్ని అదుపులోకి తీసుకోలేదని ఆయన ఆరోపించారు. చట్టపరంగా విచారణ లేదని, పోలీసులు సమాజంలో నిక్షప్త పాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. పోలీసులు నిందితున్ని చుట్టంలా చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read : Nandamuri Tarakaratna: అశ్రునయనాల మధ్య తారకరత్న అంత్యక్రియలు పూర్తి