NTV Telugu Site icon

Telangana MLC ByPoll: ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం..

Mlc

Mlc

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. పోలింగ్ ముగిసే వరకు 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ ఉండనుంది. కాగా.. ఎల్లుండి (సోమవారం) పోలింగ్కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి ఉ.8 గంటల నుండి సా.4 వరకు పోలింగ్ జరుగనుంది. అందుకోసం 605 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయగా.. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా.. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరులో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

ACB Rides: ఏసీబీ వలలో చిక్కుకున్న పోలీస్ బాస్..

వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34 అసెంబ్లీ నియోజక వర్గాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం విస్తరించి ఉంది. కాగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,23,985 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఈరోజు ప్రచారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు మీడియా సమావేశాలు నిర్వహించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్- బీఆర్ఎస్- బీజేపీ అభ్యర్థుల మధ్య పోటా పోటీ ఉండనుంది.

Srinivasa Rao: ఎన్నికల సంఘంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఆరోపణలు.. ఏమన్నారంటే?

పట్టభద్రులను ఆకట్టుకునే పనిలో ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు వ్యూహాలు రచించారు. అభ్యర్థుల తరుపున పలువురు కీలక నేతలు ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డికి మద్దతుగా కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ప్రచారం నిర్వహించారు. మరోవైపు.. వీడియోకాల్ ద్వారా మధ్యప్రదేశ్ సీఎం డా.మోహన్ యాదవ్ పట్టభద్రులకు సందేశం ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థికి ప్రచారంలో కేటీఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, బాల్క సుమన్ తో సహా పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ @తీన్మార్ మల్లన్నకు మద్దతుగా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు. మరోవైపు.. ఈరోజు సా.5 గంటల నుండి సోమవారం సా.4 వరకు మూడు ఉమ్మడి జిల్లాలో వైన్ షాప్స్ బంద్ ఉండనున్నాయి. పోలింగ్ రోజు ఉ. 6 నుండి సా.8 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కాగా.. 27వ తేదీ ప్రత్యేక సెలవు దినంగా జిల్లా కలెక్టర్లు ప్రకటించారు.