Site icon NTV Telugu

MLC Elections: చెదురుమదురు సంఘటనలు మినహా ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

Mlc Polls

Mlc Polls

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 16వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వల్ఫ ఘటనలు మినహా పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ సజావుగా కొనసాగింది. అనంతపురం నగరంలోని కేఎస్ఆర్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతల ఆందోళననిర్వహించారు.వైసీపీ నాయకులకు అనుకూలంగా అధికారులువ్యవహరిస్తున్నారని , దొంగ ఓట్లు వేసేందుకు అనుమతి ఇస్తున్నారంటూ రోడ్డుప్తె బ్తెఠాయించి ఆందోళన చేస్తున్న బిజెపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: PAPA: ముద్దు సన్నివేశం ఇబ్బంది పెట్టలేదు: మాళవిక నాయర్

తాడిపత్రిలో పోలింగ్ కేంద్రం 146 నుంచి ఓటర్ లిస్టును వైఎస్ఆర్సిపి ఏజెంట్ తీసుకెళ్లడంతో టిడిపి ఏజెంట్ అభ్యంతరం తెలపడంతో 15 నిమిషాలు పోలింగ్ నిలిపివేసి మళ్లీకొనసాగించారు. హిందూపురం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి తేజ రెడ్డి కి తన ఓటు గల్లంతు కావడంతో నిరాశ ఎదుర్తెయింది.సమయం గడిచినప్పటికీ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు క్యూ ల్తెన్ లో ఉండడంతో వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.జిల్లాలో మధ్యాహ్నం 02 గంటల వరకు పట్టభద్రులకు సంబంధించి 49.93%, ఉపాధ్యాయులకు 64.22% శాతం పోలింగ్ నమోదు అయింది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ సమయం ముగిసినా 4గంటలకు క్యూ లైన్లో ఉన్న ప్రతి ఓటరుకు అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు….స్లిప్పులు ఇచ్చి పోలింగ్ కు అనుమతిచ్చారు…..సమయం ముగిసినప్పటికీ పలు పోలింగ్ స్టేషన్ల దగ్గర బారులుతీరిన ఓటర్లు కనిపించారు. శ్రీకాకుళం జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో 60.73 శాతం ఓటింగ్ నమోదయింది. విజయనగరంలో సమయం ముగిసినా ఓటర్లకు స్లిప్పులు అందించడంతో 6 గంటలవరకూ పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. అనకాపల్లి నర్సీపట్నం పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరు పార్టీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తింది. జై అయ్యన్నాఅంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో సంఘటనస్థలి లో ఉన్న ఎమ్మెల్యే తన కార్యకర్తలతో కలిసి నినాదాలు చేస్తున్న టిడిపి వారిని ఎదుర్కొనే ప్రయత్నంలో ఇరు వర్గాల కుమ్ములాటకు దిగాయి. పోలీసుల లాఠీ చార్జ్ చేయడంతో వివాదం సద్దుమణిగింది.

శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దొంగ ఓట్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు టిడిపి నేతలు. పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు పోలీసులు. టిడిపి నేతల నిరసన తెలిపారు. నిరసనకు దిగిన వారిపైకి దూసుకొచ్చిన వైసీపీ శ్రేణులు.. ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఇరు వర్గాల నడుమ తోపులాట. టిడిపి కార్యకర్త కృష్ణ యాదవ్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆదోని 4 గంటలు దాటాక కూడా పోలింగ్ బూత్ ల వద్ద గ్రాడ్యుయేట్ ఓటర్లు బారులు తీరి కనిపించారు. నెల్లూరు జిల్లా అల్లూరులో పోలింగ్ కేంద్రం లోకిఅనుచరులతో వెళ్లేందుకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేశారు. దీంతో టిడిపి నాయకులు అడ్డుకున్నారు. వైసిపి.. టిడిపి వర్గాల మధ్య తోపులోట చోటుచేసుకుంది. ఇరు వర్గాలనూ శాంతింప చేశారు పోలీసులు.

Read Also:
Naatu Naatu Wins Oscar : నాటు నాటు సాంగ్ కు ఆస్కార్.. చిందేసిన గవాస్కర్
 

 

Exit mobile version