Site icon NTV Telugu

MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు.. గెలుపోటముల మీదా చెల్లని ఓట్ల ఎఫెక్ట్‌

Mlc Electionsv

Mlc Electionsv

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం తర్వాత వెలువడే అవకాశం ఉంది. కర్నూలు-అనంతపురం-కడప ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, చిత్తూరు-నెల్లూరు-ప్రకాశం పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే షిఫ్టుల వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే.. ఇదిలా ఉంటే.. పట్ట భద్రుల ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Also Read : TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ట్విస్ట్.. దర్యాప్తులో రాజకీయ నాయకుల ఫోటోలు..!

ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ రెండు నియోజకవర్గాలలో వేలాది ఓట్లు చెల్లకుండా పోయాయి.ఓటు వేయడం కూడా తెలియని వాళ్ళ వాళ్ళే సమస్య అని, పట్టభద్రులు కానివారు ఓటర్లుగా చేరడం వల్లే వేలాది ఓట్లు చెల్లకుండా పోతాయని అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో నాలుగు రౌండ్లకి 4664ఓట్లు, తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో నాలుగు రౌండ్స్ లో చెల్లని 9670 ఓట్లు, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పరిధిలో నాలుగు రౌండ్స్ లో 5,538 ఓట్ల చొప్పున చెల్లని ఓట్లు నమోదయ్యాయి. దీంతో.. గెలుపోటముల మీదా చెల్లని ఓట్ల ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ సాయంత్రంలోపు పూర్తి ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.

Also Read : Today Business Headlines 17-03-23: ఓలా 2 లక్షల స్కూటర్లు వెనక్కి. మరిన్ని వార్తలు

Exit mobile version