Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Mlc Elections Essential Guidelines To Avoid Invalid Votes

Telangana MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలంటే..

Published Date :February 27, 2025 , 7:48 am
By Kothuru Ram Kumar
  • గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.
  • నేడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ
  • ఓటు వేసే గ్రాడ్యుయేట్స్ సరైన విధానం పాటించాల్సిందే.
Telangana MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలంటే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడంలో కొన్ని ముఖ్యమైన నియమాలను అనుసరించాలి. ముఖ్యంగా విద్యావంతులైన ఓటర్లే అధికంగా పాల్గొనే ఈ ఎన్నికల్లో గతంలో పెద్ద సంఖ్యలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఇది ఓటింగ్ విధానంపై అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తోంది. అందుకే ఈసారి ఓటర్లు తమ ఓటు విలువైనదిగా మార్చుకోవడానికి కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉంది. మరి ఓటు వేయడంలో పాటించాల్సిన నియమాలు చూద్దాం.

Read Also: MLC Elections: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. నేడే పోలింగ్

* బ్యాలెట్ పేపర్, పెన్ను ఉపయోగం:

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయాలి. అయితే, ఓటు వేసే సమయంలో తప్పనిసరిగా పోలింగ్ అధికారులిచ్చే ఊదా (వాయిలెట్) రంగు స్కెచ్ పెన్నుతోనే ఓటు వేయాలి. ఇతర పెన్నులు, పెన్సిళ్లు ఉపయోగిస్తే ఆ ఓటు చెల్లదు.

* టిక్ మార్క్, ఇతర గుర్తులు వద్ద:

ఓటు వేస్తున్నప్పుడు టిక్ మార్క్ (✔), ఓకే (OK) అనే పదాలు, ఇతర గుర్తులు చేయకూడదు. కేవలం అంకెలను మాత్రమే ఉపయోగించాలి.

* ప్రాధాన్యతా ఓటు విధానం:

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు ఒకరికి కాకుండా అనేక అభ్యర్థులకు ప్రాధాన్యతా ఓటు వేయవచ్చు. అయితే, తప్పనిసరిగా ఓటరు ఎవరికైనా 1 (మొదటి ప్రాధాన్యత) అంకె వేయాలి. మొదటి ప్రాధాన్యత ఇచ్చే అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడిలో 1 అంకెను వేయాలి. 1 అంకె వేయకుండా 2, 3, 4 అంకెలను నేరుగా వేయకూడదు. కచ్చితంగా 1 అంకెను ఎవరికైనా ఇవ్వాలి. మిగతా అభ్యర్థులకు 2, 3, 4 ఇలా వరుస సంఖ్యలుగా ప్రాధాన్యత ఇవ్వొచ్చు.

Read Also: Assam Earthquake: అస్సాంలో భూ ప్రకంపనలు!

* ఒకే అంకెను ఒక్కరికే:

ఓటరు ఒక అభ్యర్థికి ఒకే ప్రాధాన్య సంఖ్యను మాత్రమే ఇవ్వాలి. అదే అంకెను ఇద్దరు లేదా ముగ్గురికి వేస్తే ఆ ఓటు చెల్లదు.

* అంకెల లిఖన పద్ధతి:

ఓటరు భారతీయ అంకెలైన 1, 2, 3, 4, 5 లేదా రోమన్ అంకెలు I, II, III, IV, V వంటి సంఖ్యలను మాత్రమే ఉపయోగించాలి. ఆంగ్ల అక్షరాలతో “One”, “Two” అని రాసినా, లేదా “OK”, “Yes” వంటి పదాలు రాసినా ఆ ఓటు చెల్లనిది.

* ఇతర వివరాలు రాయడం తప్పు:

బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థి పేరు పక్కన ఓటరు తన పేరు, సంతకం, ఇతర రకాల గుర్తులు పెట్టకూడదు. ఓటు వేయాల్సిన గడిని దాటి వేరే చోట అంకె రాస్తే అది చెల్లదు. అభ్యర్థి పేరుపై టిక్ చేయడం, వరుస సంఖ్యలపై మార్క్ వేయడం కూడా చేయకూడదు.

గత ఎన్నికల్లో ఓటింగ్ విధానం సరిగ్గా పాటించకపోవడం వల్ల చాలామంది ఓట్లు చెల్లనివిగా మారాయి. కాబట్టి ఈసారి ఓటర్లు పై విధంగా నిర్దేశించిన నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఒక్క చిన్న తప్పిదం ఓటు చెల్లని ఓటుగా మారే ప్రమాదం ఉంది. ప్రతి ఓటు కీలకమైనది కాబట్టి, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ballot paper
  • election rules
  • MLC ELECTIONS
  • telangana mlc elections
  • Voting Guidelines

తాజావార్తలు

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • National Highway: తెలంగాణ, ఏపీ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే.. జూన్ నాటికి అందుబాటులోకి..

  • Monalisa: పెద్దలు ఒప్పుకోలేదు కాపాడండి.. కేరళ పోలీస్ స్టేషన్లో ప్రియుడితో మోనాలిసా

  • Stock Market: స్టాక్ మార్కెట్‌లో భారీ కుదుపు.. 1,000+ పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. నిఫ్టీ కూడా దిగువకు

  • Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్లాన్.. సుకుమార్ శిష్యుడితో మెగా సినిమా!

ట్రెండింగ్‌

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions