Site icon NTV Telugu

MLC Elections Effect: విశాఖలో భారీగా నగదు పట్టివేత… ఎవరిదంటే?

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల సందడి కనిపిస్తోంది. MLC ఎలక్షన్లకు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినా ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ట చర్యలు.సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు.ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు. రంగంలో స్పెషల్ పోలీస్ టీంలు దిగాయి. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. 16వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే విశాఖలో MLC ఎన్నికల్లో భారీగా చేతులు మారుతుంది నగదు.

Read Also:Etela Rajender: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు.. చనిపోయిన బిడ్డకు ట్రీట్మెంట్ ఇచ్చారు

ఎంవీపీ పీఎస్ లిమిట్స్ లో 26లక్ష లు పట్టుబడింది. ఓ అపార్ట్ మెంట్లో ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆర్ధిక లావాదేవీలపై విచారిస్తున్నారు పోలీసులు. ధృవీకరించని పోలీసులు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నగదు ప్రవాహం కనిపిస్తోంది. పంపిణీకి సిద్ధం చేస్తున్న 26లక్షల 89వేల 500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. MVP పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకోజీపాలెంలో లవకుశ అపార్టుమెంట్ లో పట్టుకున్నారు. చోడవరం (మం) బెన్నవోలు గ్రామానికి చెందిన కంచిపాటి రమేష్ నాయుడు ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవికి చెందిన నగదుగా గుర్తించారు.

Read Also: TS EdCET : టీఎస్ ఎడ్ సెట్ 2023 షెడ్యూల్ విడుదల

Exit mobile version