MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటివరకు 20 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు నేడు గుంటూరు కలెక్టరేట్‌లో పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మణరావు నామినేషన్ వేయనున్నారు. ఇక రేపు నామినేషన్లు పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. ఈనెల 13వ తేదీ వరకు ఉపసంహరణకు గడువునిచ్చింది ఈసీ. ఈనెల 27వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న కౌంటింగ్ చేస్తారు. అయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 3 లక్షల 15 వేల 267 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. దీంతో 440 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది ఈసీ.
Read Also: OYO : వాలంటైన్స్ డే ముందు ఓయోకు గుడ్ న్యూస్.. ఆరు రెట్లు పెరిగిన లాభం
కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ… నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 85 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు. నేడు గడువు ముగియనుండడంతో పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. అటు వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటివరకు 17 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నేడు పీఆర్‌టీయూ బలపర్చిన అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నామినేషన్‌ను వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు..#
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు..