NTV Telugu Site icon

Duvvada Phone Call Leaked: దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారంలో మరో ట్విస్ట్‌.. ఆడియో లీక్‌తో బయటపడ్డ బాగోతం!

Duvvada

Duvvada

Duvvada Phone Call Leaked: దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి మధ్య వివాదానికి కారణమైన దివ్వెల మాధురి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస్‌, మాధురి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణగా భావిస్తున్న ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దానిపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీనికి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కారణమని, ఆమె వేధింపులు తట్టుకోలేకే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడానికి రోడ్డుపైకి వచ్చానని అప్పట్లో దివ్వెల మాధురి చెప్పారు. అయితే, ప్రమాదం జరిగాక మాధురిని అంబులెన్సులో తరలిస్తుండగా, ఆమెతో శ్రీనివాస్‌ ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఫోన్లో దువ్వాడ మాధురితో దువ్వాడ శ్రీనివాస్ సంభాషించినట్లుగా ఆ ఆడియోలో ఉంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు దువ్వాడ మాధురితో ఫోన్లో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ ఆడియో తొలుత మాధురి బాగోగులు అడిగిన శ్రీనివాస్‌.. అనంతరం దువ్వాడ వాణి వల్లే నేను చనిపోతున్నానని మీడియా ముందు చెప్పాలని దువ్వాడ మాధురితో ఫోన్‌లో చెప్పినట్లుగా ఆ ఆడియోలో వినిపించింది. వైద్యులతో, పోలీసులతో వ్యవహారం తాను చూసుకుంటానని ఆమెకు దువ్వాడ శ్రీనివాస్ అభయమిచ్చారు. ఇదిలా ఉండగా.. రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకున్నా కూడా సీసీ ఫుటేజ్‌ను బయట పెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు.

Read Also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు వినూత్నంగా విషెష్ తెలిపిన చిన్నారులు..

ఈ ఆడియో లీక్‌పై దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి స్పందించారు. మాధురి యాక్సిడెంట్‌ను ఆత్మహత్యగా చిత్రీకరించారని.. ఇది చాలా అన్యాయమని వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పమనడం తగదన్నారు. ఇలాంటి వ్యక్తులను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తాము పాములు, దోమలతో ఇంటి బయట ఉన్నామని.. దువ్వాడ శ్రీను కుటుంబంతో దివ్వెల మాదురి కలసి ‌ఉంటోందన్నారు. ఇలాంటి వ్యక్తులను‌ క్షమించకూడదన్నారు. ఒక్క ఆడియోతో సమాజానికి వారు ఎలాంటి వారో అర్థం అవుతుందన్నారు. ప్రపంచానికి నిజం ఏంటో తెలుస్తుందన్నారు. ఎలాంటి అబద్ధాలు మాట్లాడారో సమాజానికి అర్థం అవుతుందన్నారు. ఈ ఆడియోపై దర్యాప్తు చేసి యాక్షన్‌ తీసుకోవాలని ఆమె కోరారు.