Site icon NTV Telugu

Beeda Ravichandra: కేసులకు భయపడే కాకాణి పరారయ్యారు!

Beeda Ravichandra

Beeda Ravichandra

వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ దోపిడీలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాత్ర గురించి అందరికీ తెలుసు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర విమర్శించారు. అక్రమాలు చేయనప్పుడు ఎందుకు పరారయ్యారని, బయటకు వచ్చి తాను నిజాయితీ పరుడునని చెప్పుకోవచ్చు కదా? అని అన్నారు. కేసులకు భయపడే కాకాణి పరారయ్యారని ఎద్దేవా చేశారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా త్వరలో అరెస్ట్ కాబోతున్నాడని ఎమ్మెల్సీ బీదా తెలిపారు.

‘మాజీ మంత్రి అనిల్ కుమార్ ఇప్పటి వరకూ ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇప్పుడు బయటకు వచ్చి మాజీ మంత్రి కాకాణి పైన కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని మాట్లాడుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ దోపిడీ అందులో కాకాణి పాత్ర గురించి అందరికీ తెలుసు. అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా సోమిరెడ్డి నిరసన దీక్ష చేపడితే ఆయనపై హిజ్రాలతో దాడి చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసు. వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. రుస్తుం మైన్స్ లో కాకాణి అక్రమ తవ్వకాలు చేయించారు. అక్రమాలు చేయనప్పుడు ఎందుకు పరారయ్యారు. బయటకు వచ్చి తాను నిజాయితీపరుడునని చెప్పుకోవచ్చు కదా. కేసులకు భయపడే కాకాణి పరారయ్యారు’ అని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అన్నారు.

Also Read: IPL 2025: లక్నో స్పిన్నర్ దిగ్వేశ్‌ రాఠీకి మరో షాక్‌ తప్పదా?

‘ఎంపీ వేమిరెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయనకు అధికారికంగా మైన్స్ ఉన్నాయి. గూడూరు సైదాపురం ప్రాంతాల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కూడా అక్రమ మైనింగ్ జరిగింది. అక్రమ మైనింగ్ కేసులో తొందరలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అరెస్ట్ కాబోతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ ఇప్పుడు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై మీద విమర్శలు చేస్తున్నారు’ అని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఫైర్ అయ్యారు.

Exit mobile version