Site icon NTV Telugu

MLC Ananthababu Case: ఎమ్మెల్సీ అనంతబాబు కేసు రెండువారాలకు వాయిదా

Aphighcourt

Aphighcourt

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Ananthababu )డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఎమ్మెల్సీ అనంత బాబు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత్ బాబును పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అడ్వకేట్లు వాదించారు. తమ కొడుకు హత్య కేసులో పోలీసులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని హైకోర్టును ఆశ్రయించారు హతుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు.

కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేసిన సుబ్రమణ్యం తల్లిదండ్రులు. ఎమ్మెల్సీ అనంత్ బాబుపై మొత్తం 12 కేసులున్నాయని, రౌడీ షీట్ ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు పిటిషనర్ తరపు న్యాయవాది. సుబ్రహ్మణ్యంను మొత్తం 5 మంది చంపి, తాను ఒక్కడే చంపినట్టు ఎమ్మెల్సీ అనంత్ బాబు పోలీసులు ముందు ఒప్పుకొని మిగతా నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వాదనలు వినిపించారు.

WhatsApp : 22 లక్షల భారతీయుల అకౌంట్లు బ్లాక్‌..

సీబీఐ తరపు అడిషనల్ సొలిసిటర్‌ జనరల్ కు నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్ట్. కేంద్రం, డీజీపీ, ఎస్పీకి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్ట్. ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ అనంత్‌ ఉదయ్‌భాస్కర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కారులో మాజీ డ్రైవర్ డెడ్‌ బాడీ దొరకడం పలు విమర్శలకు తావిచ్చింది.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం తనను బ్లాక్ మెయిల్ చేశాడని అందుకే హతమార్చానని ఎమ్మెల్సీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే… ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ చేతిలో హత్యకు గురైన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. అపర్ణకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది ఏపీ ప్రభుత్వం. అటు టీడీపీ తరఫున కూడా 5 లక్షల పరిహారం బాధితుడు కుటుంబానికి చేరింది.

Exit mobile version