MLC Ananthababu: నేడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు!
- నేడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ
- అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు
- అనంతబాబు కోసం పోలీసుల గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై ఇవాళ రాజమండ్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టులో విచారణ జరగనుంది. సాక్షులను బెదిరించి బెయిల్ షరతులు ఉల్లంఘించారని పోలీసులు రెండు రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అనంతబాబు కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. మరోవైపు అనంతబాబును తక్షణమే అరెస్టు చేయాలంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు, ఎమ్మార్పీఎస్ నేతలు ఆందోళనలు చేపట్టారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2022 మే నెలలో జరిగిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కేసులో నవంబర్ 30 లోపు తుది తీర్పు ఇవ్వాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి జిల్లా కోర్టులో సాక్షుల విచారణ ప్రారంభం కానుంది. అయితే సాక్షులను ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన అనుచరుల ద్వారా బెదిరింపులకు పాల్పడి.. డబ్బులు ఆశ చూపారని కాకినాడ సర్పవరం పోలీసులు ఈనెల 21న కేసు నమోదు చేశారు. దీంతో అనంతబాబు మరోసారి అరెస్టు అవుతారా?, ఆయన బెయిల్ రద్దు పిటిషన్‌పై న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది.
Also Read
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
తాజావార్తలు
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!