MLA Yashaswini Reddy : కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున చేరుతున్నారు.. వారందరికీ హృదయ పూర్వక స్వాగతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్ధన్నపేట, పాలకుర్తి నియోజక వర్గాల నుంచి పలువురు బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి సమక్షంలో ఎమ్మెల్యేలు నాగరాజు, యశస్వని రెడ్డి ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశ్వస్విని రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున చేరుతున్నారు. వారందరికీ హృదయ పూర్వక స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడు నెలలుగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లో మంచి స్పందన కలిగిస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విస్తృత స్థాయి కార్యక్రమాలతోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు. వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది.. ఎవరికి ఏ స్థాయి లో ప్రాధాన్యత ఇవ్వాలో అలాగే ఇస్తామని ఆమె అన్నారు. పాత నాయకులు, కొత్త నాయకులు కలిసికట్టుగా పని చేసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించాలని ఆమె కోరారు.
Also Read
- Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
అంతేకాకుండా.’కేసీఆర్ కూతురు కనిత ధర్నా చౌక్ వద్ద నిన్న శివరాత్రి రోజున ధర్నా చేసింది. ఆమె వైఖరి చూస్తే నవ్వొస్తుంది. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి పుణ్యం కోసం తీర్థ యాత్రలకు పోయినట్టుంది కవిత వైఖరి. ఇంతకాలం పక్కన పెట్టిన జాగృతిని మళ్ళీ తెరిచింది. తెలంగాణ జాగృతి పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం లో ఏనాడైనా మహిళల గురించి మాట్లాడారా.. ఎన్నడూ గుర్తుకు రాని మహిళలు పదవి పోగానే కవితకు గుర్తుకు వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి పనులు చేస్తున్నాం.. కాంగ్రెస్ ప్రభుత్వం మొదట అమలు చేసిన ఉచిత బస్ సౌకర్యం మహిళల కోసమే.. మహిళలకు 500 రూపాయలకు గ్యాస్ పథకం, ఉచిత గృహ విద్యుత్ అన్ని పథకాలు మహిళ కోసమే… కనిత మహిళల కోసం ఎలాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.’ అని ఎమ్మెల్యే యశ్వస్విని రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!