కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహిచారు. తన గెలుపుకు కృషిచేసిన గన్నవరం నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. గన్నవరం టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ గెలుపు కోసం కష్టపడి నియోజకవర్గంలో పనిచేశానని.. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాదని ముందుగానే తాను చెప్పానన్నారు. జగన్మోహన్ రెడ్డికి తాను చేసిన సవాల్ను నిజం చేసినందుకు గన్నవరం ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు.
Lebanon: అమెరికా ఎంబసీ దగ్గర కాల్పులు.. సిరియా వ్యక్తి అరెస్టు
నారా భువనేశ్వరి అమ్మను అవమానించపడటానికి గన్నవరం వేదికగా కావడం తనకు చాలా బాధగా ఉందని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నారా భువనేశ్వరి అమ్మకు, చంద్రబాబు నాయుడుకు గన్నవరం నియోజకవర్గాన్ని గిఫ్ట్ గా ఇస్తానని చెప్పా.. తనను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ కార్యకర్తలను తాను ఏమీ అననని.. అక్రమ కేసులు బనాయించనని చెప్పారు. పార్టీకి చెందిన కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం మాత్రమే పనిచేస్తారని అన్నారు. అక్రమ మైనింగ్, గంజాయి నివారించే దిశగా పరిపాలన కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు.
T20 World Cup: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా..
చంద్రబాబు నాయుడును శాసనసభ గౌరవ సభలాగా కాకుండా కౌరవ సభగా ఉద్దేశించి మాట్లాడిన నాయకులు గన్నవరానికి చెందడం బాధాకరం అని ఆరోపించారు. గన్నవరంలో పోలీసులు, న్యాయం చేయడానికి లేరని.. తమకు పోలీసులు వద్దు అని తాతను గతంలో చెప్పానని తెలిపారు. మరోవైపు.. నియోజకవర్గంలో కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించే విధంగా చేస్తానని అన్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో ముందుండే విధంగా కృషి చేస్తానని.. మరొక్కసారి తన విజయానికి తోడ్పడిన గన్నవరం ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేశారు.