ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓటమిపై అధిష్టానం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పార్టీ సస్పెండ్ చేసింది. ఆమె క్రాస్ ఓటింగ్ చేశారని పార్టీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా ఆమె మీడియాకు అందుబాటులో లేకుండా పోయారు. తాజాగా ఆమె ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల తీరు, పార్టీ నేతల విమర్శలపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన కామెంట్లు చేశారు. గత మూడు రోజులు గా వైసీపీ గుండాలు నన్ను వేధిస్తున్నారు..
నేను అజ్ఞాతంలో ఉన్నానని అంటున్నారు. మొన్న డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ లాగా నన్ను చంపుతారు అని అజ్ఞాతం లోకి వెళ్ళాను. వాళ్ళ దందాలకు నేను అడ్డు వస్తున్నాను అని ఇలా చేస్తున్నారు అన్నారు ఉండవల్లి శ్రీదేవి.నేను ఓటు వేసే టేబుల్ కింద ఎవరైనా కూర్చున్నారా? లేదా సీసీ కెమెరా పెట్టారా?నేను ఓటు వేసే ప్యానెల్ లో జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు. మిగతా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు అనుమానం పడట్లేదు. నన్ను ఎందుకు వేధిస్తున్నారు? నన్ను పిచ్చి కుక్క లాగా నిందవేసి బయటకు పంపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: India: కెనడాలో దాడిపై భారత్ సీరియస్.. ఆ దేశ రాయబారికి సమన్లు..
వైయస్సార్ తనయుడు పార్టీ అంటే విలువలతో ఉంటాయనుకున్నా.రాజకీయాల్లో ఎలాంటి విలువ లేని రాజకీయాలు ఉంటాయని నేను అనుకోలేదు.అమరావతి రైతుల కోసం ప్రాణం పోయేదాకా పోరాటం చేస్తా. అమరావతి మట్టిపై ప్రమాణం చేద్దాం నేను డబ్బులు తీసుకున్నానని నిరూపించండి.పిచ్చి కుక్కతో సమానంగా నన్ను చూశారు.ఈరోజు నుండి నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను.మొన్నటివరకు నాతోపాటు ఉన్నవారే నా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు.నియోజకవర్గ ప్రజలు కలిసి వస్తే నేను వారి సమస్యపై పోరాటం చేస్తాను.నాకు ప్రాణ హాని ఉంది నాకేం జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత వహిస్తాడు.నాపై కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడుతున్నారు. నేను దళిత ఎమ్మెల్యేను అందుకే పార్టీలో నాకు సరైన గుర్తింపు లేదన్నారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. అమరావతి రాజధాని ఉద్దండపాలెంలో ఇసుక మాఫియా ఎవరిది. దానికి నేను అడ్డం వస్తున్నాను అని ఈ విధంగా నన్ను పార్టీ నుంచి తప్పించారన్నారు శ్రీదేవి.
Read Also: Telugudesam Party:ఈనెల 28న టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ