NTV Telugu Site icon

Honey Bee Attack : ఎమ్మెల్యే పై తేనేటీగల దాడి.. తప్పించుకున్న రాజయ్య

Rajaiah

Rajaiah

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు సోమవారం నాడు తృటిలో ప్రమాదం తప్పింది. తేనేటీగల దాడి నుంచి తాటికొండ రాజయ్య సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే తన వాహనంలో ఎమ్మెల్యే రాజయ్య ఘటన స్థలం నుంచి వెళ్లిపోయాడు. అయితే ఎమ్మెల్యే రేణుక ఎల్లమ్మ జాతరలో బోనాలను సమర్పించేందుకు వెళ్లడంతో అక్కడున్న వారు దివిటీలు పట్టడంతో దాని నుంచి వచ్చిన పొగతో తేనేటీగలు దాడి చేసేందుకు వచ్చాయి.

Also Read : Mp Kanakamedala Ravindra: విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రమంత్రి ప్రకటన.. ఏం అన్నారంటే?

వరంగల్ జిల్లాలోని జఫర్ గడ్ మండలంలోని ఉప్పుగల్ వద్ద జరిగిన రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇవాళ హాజరయ్యారు. అయితే ఈ సమయంలో దివిటీలను వెలిగించారు. ఈ ఏరియాలో తేనేటీగలున్నాయి. దివిటీలు వెలిగించడంతో తేనేటీగలు ఒక్కసారిగా అక్కడున్నవారిపై దాడికి దిగాయి. ఈ విసయాన్ని గుర్తించిన స్థానికులు ఎమ్మెల్యే రాజయ్యను అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యే రాజయ్య వెంటనే తన వాహనంలో అక్కడి నుంచి కారులో వెళ్లిపోయాడు. ఉప్పుగల్ వద్ద తేనేటీగల దాడితో ఎమ్మెల్యే రాజయ్య తప్పించుకోవడంతో అక్కడ ఉన్నవారు ఊపిరిపీల్చుకున్నారు. స్థానికులు అక్కడున్న తేనేటీగలను పొగబెట్టి వెళ్లగొట్టారు. ఈసమయంలో అక్కడే ఉన్న మరి కొందరు తేనేటీగల దాడిలో స్వల్పంగా గాయపడ్డారు. తేనేటీగల దాడిలో స్వల్పగాయాలపలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు వెల్లడించారు.

Also Read : Perni Nani: రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే.. అది పవన్ కే వచ్చేది

నిత్యం వార్తల్లో ఉండే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం నాడు.. బీఆర్ఎస్ మహిళ సర్పంచ్ పై లైంగిక దాడికి పాల్పడడంతో ఆమె పట్ల తాను వ్యవహరించిన తీరుకు క్షమాపణ చెప్పారు. దీంతో సదరు సర్పంచ్ కూడా మరోసారి ఇలా జరిగితే పెట్రోల్ పోస్తానంటూ కామెంట్స్ చేశారు.