NTV Telugu Site icon

Talari Venkat Rao: ఏజెన్సీవాసులకు గుడ్ న్యూస్ ..సత్యసాయిబాబా నీటిపథకం షురూ

Ysrcp Mla Talari

Ysrcp Mla Talari Venkat Rao Booked In A Case

ఏజెన్సీ ప్రాంత వాసులకు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు దీపావళి శుభవేళ శుభవార్త వినిపించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహించారు. 14 నెలలుగా నిలిచి పోయిన సత్య సాయి బాబా మంచినీటి పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తన క్యాంపు కార్యాలయంలో ప్రకటించారు…మంచినీటి పథకానికి 17 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని టెండర్ల ప్రక్రియ కూడా ముగిసిందన్నారు.

Read Also: Ebola Outbreak: ఉగాండాలో ఎబోలా కల్లోలం.. ఇప్పటి వరకు 40 మరణాలు.

మరో నెల రోజుల్లో ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలోని గోపాలపురం, కొవ్వూరు, చింతలపూడి నియోజకవర్గాల పరిధిలో 243 గ్రామాలకు శుద్ధి చేయబడిన తాగునీరు అందించడం జరుగుతుందని ఈ పథకంలో పనిచేసే కార్మికుల వేతన బకాయిలకు 40 లక్షల రూపాయలు కేటాయించామని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. కాగా 2007 సంవత్సరంలో రూ. 500 కోట్లతో శ్రీ సత్య సాయి బాబా మంచినీటి పథకం ప్రారంభించారు.. తూర్పు మరియు పశ్చిమగోదావరి జిల్లాలలో 17 మండలాల పరిధిలోని 243 గ్రామాలకు నీరు అందించారు.. నీటి సరఫరా సంస్థ కాంట్రాక్టు ముగియడంతో గత 14 నెలలుగా మంచినీటి సరఫరా ఆగిపోయింది. కార్మికుల జీతాలు కూడా ఆగిపోయాయి.. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన చొరవతో ఈ పథకం మళ్లీ ప్రారంభిస్తున్నామని చెప్పారు ఎమ్మెల్యే తలారి.

Read Also: Cyclone sitrang: సిత్రాంగ్.. 12 గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారుతుందా?