Site icon NTV Telugu

MLA Seethakka: అక్కడి పరిస్థితిని చూసి కన్నీరు పెట్టుకున్న సీతక్క

Seethakka

Seethakka

తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వానలు పడుతుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా వరంగల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా చాలాచోట్ల వరద నీటిలో వంతెనలు మునిగిపోయాయి.

Read Also: Sitara Ghattamaneni: లండన్ వీధుల్లో ఘట్టమనేని వారసురాలు..

అయితే, ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం మొత్తం వరద నీటితో మునిగిపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఇవాళ (గురువారం) గ్రామ పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క కన్నీరు పెట్టారు. ఇప్పటికీ గ్రామంలో సుమారు వంద మంది ప్రమాదంలో ఉన్నారని, వారిని హెలికాఫ్టర్ ద్వారా రక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె వేడుకున్నారు. కొందరు గ్రామ పంచాయతీ కార్యాలయంపైనా ఉండిపోయారు. సహాయం కోసం బాధితులు ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

Read Also: Congress: కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ వాయిదా

భారీగా వరదలతో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. పరిస్థితి మరింత చేదాటకముందే ములుగు ప్రాంత ప్రజలను రక్షించేందుకు హెలికాఫ్టర్ కేటాయించి రక్షించాలని ఆమె చేతులెత్తి వేడుకున్నారు. తమ వారిని వెంటనే రక్షించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. దీనిపై ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు. మరోవైపు మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం నీట మునిగింది. గ్రామంలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది.

Read Also: Manipur Women Video: మణిపూర్‌ మహిళల వేధింపుల ఘటన.. కేసు సీబీఐకి అప్పగింత

అయితే, గోవిందరావు పేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163వ నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో కోతకు గురైంది. దీంతో తాడ్వాయి, ఏటూరు నాగారం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లక్నవరం జలాశయం పరవళ్లు తొక్కుతూ ఉండటంతో సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Exit mobile version