NTV Telugu Site icon

MLA Sanjay Kumar : పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించిన సంజయ్ కుమార్

Mla Sanjeev Kumar

Mla Sanjeev Kumar

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఇవాళ ఆయన జగిత్యాల జిల్లాలో మాట్లాడుతూ.. నేను పార్టీ మారను. ఏ పార్టీలోకి వెళ్ళనని ఆయన క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారతాడని పలు పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయం నా వృత్తి, వైద్యం నా ప్రవృత్తి అని ఆయన తెలిపారు. వాళ్లు వీళ్లు పార్టీలు మారుతున్నట్టు నేను మారనని, మూడుసార్లు ఎమ్మెల్యేగా పార్టీ అవకాశం ఇచ్చింది… ప్రజలు గెలిపించారన్నారు. ఎప్పుడు కార్యకర్తలు, ప్రజల వేనంటే ఉంటానని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ముఖ్యనేతలందరూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవగా.. ఇప్పుడు మరో బిగ్ షాక్ తగలనుంది. కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లోనే(Medak).. అదికూడా స్నేహితుడే ఆయనకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారట. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్ స్నేహితుడు మదన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారట. కొన్నాళ్లుగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మదన్ రెడ్డి.. కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లోకి వెళ్లిన మదన్ రెడ్డి.. త్వరలోనే ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు ఆయన అనుచరులు.