NTV Telugu Site icon

MLA Sanjay Kumar : జగిత్యాల నూతన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయిస్తా

Sanjay Kumar

Sanjay Kumar

జగిత్యాల జిల్లా మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ ముసాయిదాతో రైతులకు నష్టము జరుగకుండా రద్దు చేయిస్తానన్నారు. గత ప్రభుత్వాలు సమయంలో పర్మిషన్‌లు లేకుండా వందలాది ఇల్లులు కట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అగ్రికల్చర్ జోన్ ఇల్లులు కట్టేలా కాంగ్రెస్‌ నాయకులు జగిత్యాలను అస్తవ్యస్తం చేశారని ఆయన ఆరోపించారు. ప్రజల అభిప్రాయ మేరకు అన్ని జోన్ లు ఆపేలా చేస్తానన్నారు సంజయ్‌ కుమార్‌. అభ్యంతరాలు చెప్పనీయకుండా అపవాదులు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల చేతుల్లోనే పరిపాలన మున్సిపల్ చేతుల్లోకి రాకుండా గ్రామ పాలన జరిగేలా చూశామని ఆయన తెలిపారు.

Also Read : Road Accident: టీ స్టాల్ వద్ద ఉన్న జనాలపైకి దూసుకొచ్చిన ట్రక్కు.. ఆరుగురు బలి

మాస్టర్ ప్లాన్ లో కొన్ని గ్రామాలు కలవకుండా చూసామని ఆయన వివరించారు. అభివృద్ధి కావాలని కొన్ని ప్రాంతాలు కలిపామని, గ్రామాల్లో మాస్టర్ ఫ్లాన్ వలన భూములు మార్పులు ఉంటాయని అందరూ ఆవేదన చెందుతున్నారన్నారు. మాస్టర్ ప్లాన్ కు సర్పంచ్ లు మౌలిక వసతుల కల్పన కోసం మాత్రమే సపోర్ట్ చేశారన్నారు. డిడి ఎఫ్ కన్సల్ టెన్సీ వాళ్ళు పట్టణానికి ఏమి ఉండాలో ప్రణాళిక చేశారని ఆయన వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా సవరణకు ఎక్కువ రోజులు ఇచ్చి అన్ని చోట్ల బోర్డులు పెట్టామన్నారు సంజయ్‌ కుమార్‌.

Show comments