Site icon NTV Telugu

MLA Raja Singh: కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే.. నేను రాజీనామా చేస్తా.. నాకు కేంద్ర పెద్దల ఆశీర్వదం ఉంది..

Mla Raja Singh

Mla Raja Singh

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంశంపై మాట్లాడారు. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తానూ రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. దీనికి ప్లానింగ్ అంత కిషన్ రెడ్డి చేశారని ఆరోపించారు. తాను ఎప్పుడూ విమర్శలు చేయలేదని చెప్పారు.. కేంద్ర పెద్దల ఆశీర్వాదం, యోగి ఆధిత్యానాథ్ ఆశీర్వాదం తనకు ఉందన్నారు. గోషామహాల్‌లో ఎవరికి పార్టీ పదవి ఇచ్చారని ప్రశ్నించారు. ఇవాళ కూడా నా బీజేపీనే రేపు కూడా నా బీజేపీ నే అన్నారు..

READ MORE: Balakrishna: ముంబై స్కూల్లో బాలయ్య సందడి

పెద్దలు పిలిస్తే అన్ని వెళ్తా.. ఇక్కడ ఉన్న అన్ని విషయాలు చెబుతా అని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. పార్టీ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. బీజేపీ తప్పు చేసినప్పుడల్లా తాను మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు. రబ్బర్ స్టాంప్ గా మారొద్దని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుకు సూచించారు. చివరగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేయనని ఏమీ పీక్కుంటారు పిక్కోండని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. రాజాసింగ్ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీలో చర్చ కొనసాగుతోంది. పార్టీ పెద్దలు ఈ వ్యాఖ్యలును తప్పుపడుతున్నారు.

READ MORE: MLA Raja Singh: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version