NTV Telugu Site icon

MLA Raja Singh : మోహన్‌బాబు క్షమాపణలు చెప్పడం ఉత్తమం.. రాజాసింగ్‌ కీలక వ్యాఖ్యలు

Mla Raja Singh

Mla Raja Singh

MLA Raja Singh : సీనియర్ నటుడు మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి ఘటనపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. గురువారం విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ, మోహన్ బాబు కుటుంబ గొడవల నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. వారి కొడుకు మీడియాను ఆహ్వానించడం వలననే జర్నలిస్టులు హౌస్‌లోకి ప్రవేశించారని వ్యాఖ్యానించారు.

KTR: ఆ రైతులను విడిచి పెట్టమని రేవంత్‌కు చెప్పండి.. రాహుల్‌ని కోరిన కేటీఆర్..

మీ కుటుంబ సమస్యలు మీ ఇంటి వరకు మాత్రమే పరిమితం ఉంటే మంచిదని మోహన్ బాబుకు సూచించారు. అయితే, ఆ సమస్యను పబ్లిక్‌లో పెట్టడం వల్ల ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. వాస్తవాలు ప్రజల ముందుకు తీసుకురావడం మీడియా బాధ్యత అని పేర్కొన్నారు. మీడియా ఏ పార్టీకి సపోర్ట్‌గా ఉండదని స్పష్టం చేశారు.

ఈ అంశాన్ని ఇలాగే వదిలేస్తే మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. మీ వైపు నుంచి పొరపాటు జరిగిందని గుర్తించి క్షమాపణలు చెప్పడం ఉత్తమమని తెలిపారు. గాయపడిన జర్నలిస్టును పరామర్శించడం కూడా మంచిదని సూచించారు. మీడియా ఒక వ్యక్తిని హీరోగా చేయగలదని, అదే సమయంలో జీరోగా మార్చగలదని హెచ్చరించారు.

Sadhguru: బిజినెస్‌మేన్‌ను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం మంచిది కాదు

Show comments