బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు చేశాడు. ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ తమాషాలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు నిర్మించటంలో ప్రభుత్వం విఫలమైందని రాజాసింగ్ ఆరోపించారు. అర్హులను కాదని, అనర్హులు, బీఆర్ఎస్ వాళ్ళకే డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తున్నారని ఆయన అన్నారు. గోషామహాల్ నియోజకవర్గంలో అర్హత లేని అనేక మందికి ఇళ్ళు ఇచ్చారు.. డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిందని రాజాసింగ్ ఆరోపించారు. కానీ, తామే నిర్మించినట్లు బీఆర్ఎస్ చెబుతోందన్నారు.. ఇక కేసీఆర్ హయాంలో రాష్ట్రం మత్తుల తెలంగాణగా మారిందని గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎద్దేవా చేశాడు.
కొల్లురులో డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ కార్యక్రమం వేదికను బహిష్కరించాను అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యనించారు. ఏ వేదికపై ఏం మాట్లాడాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలియదు.. బీఆర్ఎస్ ఎమ్మేల్యేలకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని ఆయన కోరారు. 2BHK ఇళ్ళ పంపిణీ కార్యక్రమంలో మోడీని, బీజేపీ ను టార్గెట్ చేస్తున్నారు.. అందుకే నేను వేదికపై నుంచి వచ్చేశాను అంటూ రాజాసింగ్ తెలిపారు.
Read Also: Tirumala Brahmotsavams: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
కాగా, GHMC పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 11,700 మంది లబ్దిదారులకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. లబ్దిదారులను ఆన్‌లైన్ డ్రా ద్వారా ఎంపిక చేస్తామని చెప్పింది.. అయితే రాజాసింగ్ మాత్రం దీన్ని తప్పు పట్టారు.. బీజేపీ నుంచి బహిష్కరించబడిన నేతగా రాజాసింగ్ ప్రస్తుతం ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా నిలిచిపోయాడు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా తాను ఇకపై అసెంబ్లీలో అడుగుపెడతానో లేదో అనే కామెంట్స్ చేశాడు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులపై బీఆర్ఎస్ సర్కారు తీరును విమర్శించడంతో ఆయన బీజేపీ, బీఆర్ఎస్ తరపున పోటీ చేసే ఛాన్స్ కనిపించడం లేదు. ఇక స్వతంత్ర అభ్యర్దిగా ఎన్నికల బరిలో నిలుస్తారని అందరూ అనుకుంటున్నారు.