ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి. విచారణను రేపు మ.12 గంటలకు న్యాయమూర్తి వాయిదా వేశారు. ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనాలని చూశారని, అలాంటప్పుడు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడంలో తప్పులేదని కోర్టుకు తెలిపారు. అయితే.. కోర్టుకు నివేదిక అందజేసిన చేసిన తర్వాత అది పబ్లిక్ డొమైన్‌లోకి వస్తుందని, ప్రజాక్షేత్రంలోకి ఎవిడెన్స్ వచ్చిన తర్వాతనే కేసీఆర్ మీడియా ముందు ప్రకటించారన్నారు. అయితే.. వాదనలు విన్న అనంతరం.. సింగిల్ బెంచ్ ఆర్డర్ పై స్టే కు నిరాకరించి.. సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించింది.
Also Read : Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్న వ్యక్తి చనిపోతే రుణాన్ని ఎవరు చెల్లించాలి ?
అయితే ఈ నేపథ్యంలోనే సీబీఐ చేతికి హైకోర్టు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ అందింది. ఏక్షణమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది సీబీఐ. అయితే.. మొయినాబాద్ పీఎస్ ఎఫ్ఐఆర్‌ను సీబీఐకి బదిలీ చేసింది హైకోర్టు. దీంతో.. క్రైం నెంబర్ 455/2022 ఆధారంగా కేసు నమోదు చేయనుంది సీబీఐ. ఇప్పటికే సిట్ దర్యాప్తును రద్దు చేసింది హైకోర్టు. సింగిల్ బెంచ్ ఆర్డర్ కాఫీనీ సీబీఐ న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఏసెక్షన్స్ కింద కేసులు నమోదుచేయాలన్న అంశంపై చర్చలు జరుపుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది.
