Prasanna Kumar Reddy: నేను కాదు.. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డే నాపై ఆరోపణలు చేశారు!

  • పోలీసుల విచారణకు ప్రసన్న కుమార్ రెడ్డి హాజరు
  • మూడు గంటల పాటు విచారించిన పోలీసులు
  • 40 ప్రశ్నలు అడిగారన్న కోవూరు మాజీ ఎమ్మెల్యే
  • విమర్శలు, ప్రతి విమర్శలు సహజం
Prashanthi Reddy Vs Prasanna Kumar Reddy

Prashanthi Reddy Vs Prasanna Kumar Reddy

Prashanthi Reddy vs Prasanna Kumar Reddy: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓ మహిళ ఫిర్యాదుతో కోవూరు పోలీసులు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఈరోజు ఉదయం పోలీసుల విచారణకు ప్రసన్న కుమార్ రెడ్డి హాజరయ్యారు. పోలీసులు ఆయన్ను మూడు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనను పోలీసులు 40 ప్రశ్నలు అడిగారని, అన్నిటికీ సమాధానం చెప్పానని తెలిపారు.

Also Read: Heart Attack: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగ్‌ పైనే కుప్పకూలి..!

ప్రసన్న కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ఇలాంటి విషయాల్లో కేసులు పెడితె జైళ్లు, కోర్టులు సరిపోవు. కేసుకు సంబందించి పోలీసులు 40 ప్రశ్నలు అడిగారు. అందుకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చాను. నా వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారు. నేను ఎక్కడా వ్యక్తిగతంగా మాట్లాలేదు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గురించి నేను మాట్లాడలేదు. నా మాటలను వక్రీకరించారు. బుచ్చిరెడ్డిపాళెం పర్యటనలో ప్రశాంతి రెడ్డే నాపై ఆరోపణలు చేశారు. స్టేజ్ మీద ఉన్న వారి మీద కూడా కేసులు పెట్టారు. నవ్వితే, చప్పట్లు కొడితే కేసులు పెట్టడం హాస్యాస్పదం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి కేసులు పెడతాం అనేది మంచి సంప్రదాయం కాదు’ అని అన్నారు.