NTV Telugu Site icon

MLA Prasanna Kumar Reddy : చంద్రబాబు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని వారాహి ఎక్కి చదువుతున్నావ్

Mla Prasanna Kumar

Mla Prasanna Kumar

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిది నెలలో ఎన్నికలు రాబోతున్నాయి ప్రతిపక్షాలన్నీ ఒకటై జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ప్రతి బహిరంగ సభలో వైసీపీ నాయకులను కార్యకర్తలను ఇష్టమొచ్చినట్టు తిట్టటం మొదలయిందన్నారు. చంద్రబాబు సూట్ కేసులు ఇచ్చి కొనుక్కున్నటువంటి వ్యక్తి పవన్ కల్యాణ్‌ అని ఆయన మండిపడ్డారు. నాలుగు రోజుల నుండి పవన్ కల్యాణ్ వారాహి ఎక్కటం.. బట్టలు ఊడదీసి కొడతాను, తోలు తీస్తాను తాట తీస్తాను అని మాట్లాడుతున్నాడని, ఇదే మాట రాజశేఖర్ రెడ్డి పై కూడా వాడాడని, బట్టలూడదీసి కొడతామని ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు వీళ్లంతా మాట్లాడారని, ప్రజలు ఎవరి బట్టలు ఊడదీసి తరిమేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు.

Also Read : Rahul Gandhi: రాహుల్ గాంధీ రియల్ “దేవదాస్”.. బీజేపీ వ్యంగ్యాస్త్రాలు..

అంతేకాకుండా.. ‘నీకు సిగ్గుండాలి పార్టీ పెట్టావు.. రెండు దగ్గర్లో ఓడిపోయావు… రెండు చోట్లా పవన్ బట్టలు ఊడదీసి ప్రజలు తరిమి కొట్టారు. నీ బట్టలూడదీసి కొట్టే మాటలు ఎక్కడ నేర్చుకున్నావ్. అసలు నీ గుర్తు ఏందో చెప్పు నీ గాజు గ్లాస్ ఎగిరిపోయింది. నీ సింబల్ ఏంది ఇప్పుడు. అసలు నీ పార్టీ అనేది ఉందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. చంద్రబాబు నాయుడు దగ్గర నీ తలకాయ తీసి పెట్టావు. కొన్ని కోట్లు చంద్రబాబు నాయుడు వద్ద తీసుకోవడం వాస్తవం. ఇది జగమెరిగిన సత్యం. నీకు అంత కోరికుంటే మా బట్టలు విప్పదీసి మావి చూడాలనుకుంటే చెప్పు వస్తాం. బ్రహ్మాండంగా మేమే వచ్చి గుడ్డలిప్పి చూపిస్తాం. పద్ధతులు మార్చుకో నీకే కాదు ఉండేది ..నోరు మాకు ఉంది. మేము కూడా ఇస్తానుసారంగా మాట్లాడగలం.. చిరంజీవి పెద్దమనిషి.. మాస్ హీరో మంచి మనసున్న మహారాజు. ఆ కుటుంబంలో పుట్టి ఏం భాష ..ఇది పద్ధతేనా. నీవల్ల చిరంజీవికి నీ కనతండ్రికి పరువు పోతోంది. రాష్ట్రంలో వాళ్ళిద్దరి పరువు తీస్తున్నావు… ఒకరోజు ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెడతానన్నావు.. ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పావు. ఓడిపోయినా మీతోనే ఉంటానని చెబుతున్నావు అసలు ఏందిది.

Also Read : Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

వంగవీటి రంగాను చంపించిన చంద్రబాబు దగ్గర నీ తలకాయ తీసి పెట్టావు. చెప్పు తో కొడతానన్నావు నేను చాలెంజ్ చేశాను. ఈమధ్య నీ దగ్గర నుండి మాటే లేదు… నువ్వు ఏం మాట్లాడుతావో నీకే తెలియదు పిచ్చోడివి మెంటలోడివి నువ్వు ఎర్రగడ్డ హాస్పిటల్లో విశాఖపట్నం మెంటల్ ఆస్పత్రిలో చేరడం మంచిది… ఎంత తొందరగా చేర్పిస్తే అంత మంచిది… ఈ భాష నాకు తెలిసి మా కుటుంబం 1961 నుండి రాజకీయంలో ఉన్నాము ఇటువంటి భాష వాడే రాజకీయ నాయకుని నేనెప్పుడూ చూడలేదు… చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని వారాహి ఎక్కి చదువుతున్నావ్. ప్రతి మాట చంద్రబాబు నాయుడు దే… ముద్రగడ పద్మనాభానికి నువ్వు సమాధానం చెప్పు నీ చెంచాలు కాదు… నీకు లెటర్ రాశాడు ముద్రగడ్డ పద్మనాభం పెద్దమనిషి నిజాయితీగా వ్యవహరిస్తాడు… ముద్రగడ పద్మనాభం భార్యని కొడుకుని అందరినీ చంద్రబాబు కొట్టించాడు కదా… నువ్వేమన్నా ముద్రగడ్డ పద్మనాభం కి అనుకూలంగా మాట్లాడావా కనీసం పలకరించావా… మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు వెళ్లి ముద్రగడ్డ పద్మనాభంనికి ధైర్యం చెప్పి పలకరించారు… ఆనాడు రైలు తగలబెట్టిన వ్యవహారం లో కొన్ని కేసులు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎత్తేశాడు…. కాపు సామాజిక వర్గం అంతా నీ వెనుక వస్తుందనుకుంటున్నావు.. ఆఖరికి నువ్వు ఒక్కడివే మిగులుతావు… కాపు సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్లీ కావాలని కోరుకుంటున్నారు… నువ్వు కాదు కదా నీ జేజమ్మ వచ్చినా జగన్మోహన్ రెడ్డి ని దించలేరు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.