Site icon NTV Telugu

MLA Pinnelli: నేడు ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి లంచ్మోషన్ పిటిషన్పై విచారణ..

Ap High Court

Ap High Court

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న ( గురువారం) మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను వెంటనే మార్చాలంటూ న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ కేసులో ఐజీ సహా కొందరు పోలీస్ అధికారులు తనను టార్గెట్ చేసి ఏకపక్షంగా వ్యవహరించారని పిల్ లో పేర్కొన్నారు. కాగా, మాచర్లలో అల్లర్ల తర్వాత వైసీపీ క్యాడర్ పైనే కేసులు పెట్టారు తప్ప మా ఫిర్యాదులను పట్టించుకోవటం లేదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ లో ప్రస్తావించారు.

Read Also: Delhi: తీవ్రస్థాయిలో నీటి కష్టాలు.. ట్యాంకర్ రాగానే ఎగబడ్డ జనాలు

అయితే, ఈ కేసును విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. నేటి మధ్నాహ్నం ఈ కేసులో వాదనలు జరగనున్నాయి. అయితే, కాగా, మాచర్లలో జరిగిన అల్లర్లపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో బెయిల్ ను మంజూరు చేయగా.. ఈ కేసులో విచారణ అధికారులను మారుస్తుందా లేదా అనుది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.

Exit mobile version