NTV Telugu Site icon

Pinnelli Ramakrishna Reddy: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి మరో ముందస్తు బెయిల్ పిటిషన్..

Pinnelli

Pinnelli

MLA Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో ముందస్తు బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు. హత్యాయత్నం కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. ఉన్నత న్యాయస్థానంలో హౌస్ మోహషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇక, ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ చేయనుంది. తనకు కౌంటింగ్ ఉందని ఆ పిటిషన్ లో పిన్నెల్లి వెల్లడించారు. కాగా, పాల్వాయి గేటు పోలింగ్ సెంటర్ లో టీడీపీ ఏజెంట్ పై హత్యాప్రయత్నం చేశారనే ఒక కేసుతో పాటు సీఐని హతమార్చేందుకు ట్రై చేశారనే దానిపై కూడా మరో కేసు నమోదైంది. మొత్తం మూడు కేసుల్లో.. ఈ రెండు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ః

Read Also: MLC Polling: ప్రారంభమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్..

అయితే, ఇప్పటికే ఈవీఎంల ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. జూన్ 6వ తేదీ ఉదయం వరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తీర్పు ఇచ్చింది. అలాగే, మాచర్లకు వెళ్లకూడదని పిన్నెల్లికి హైకోర్టు షరతులు కూడా పెట్టింది. దీంతో ఈ మూడు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించగా.. నేడు విచారణ జరగనుంది.

Show comments