NTV Telugu Site icon

Muthireddy Yadagiri Reddy : ఎమ్మెల్సీ పల్లాపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Muthireddy Yadagiri Reddy

Muthireddy Yadagiri Reddy

జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని సోలిపురం అంకుశ పురం గ్రామంలో కమ్యూనిటీ భవనాలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ.. తరిగొప్పుల మండలానికి నీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎస్టిమేషన్ ఇస్తే 104 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణానికి మంజూరు చేశారని, ప్రణాళిక సిద్ధం చేసి సాంక్షన్ పూర్తయిన తర్వాత తెలిసి తెలియని కొంతమంది నేనే 80 కోట్లు సాంక్షన్ చేయించినట్టు చంకలు గుద్దుకుంటు ప్రచారం చేస్తున్నారు, ఇది అవమానకరమన్నారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తరిగొప్పుల మండలాలకు చెందిన నాయకులతో, కార్యకర్తలతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టడం పార్టీకి విరుద్ధమని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని గ్రహించి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఉన్నారని, ఇద్దరు ఎమ్మెల్సీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మందలించారని ఆయన అన్నారు.

Also Read : Harish Rao: 7,200 మంది మత్స్యకారులకు గుర్తింపు కార్డులు.. పంపిణీ చేసిన హరీష్‌ రావు

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ టికెట్ వచ్చిందని కల్లబొల్లి ప్రచారం చేస్తున్నాడని, నిజంగా పార్టీ టికెట్ కేటాయిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే పైనే బాధ్యత అప్పగిస్తదని ఆయన అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తించడం పార్టీకి విరుద్ధమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ బాధ్యతలు కేవలం ఉద్యమాలు చేసిన వారికే తెలుస్తదని, భాజాప్త పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికే టికెట్ కేటాయిస్తదన్నారు. ప్రజలు నన్ను రెట్టింపు మెజారిటీతో గెలిపిస్తారన్న ముత్తిరెడ్డి.. మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను తప్పుదోవ పట్టించిన ఎమ్మెల్సీలను పార్టీ తప్పుపడుతుంది, కానీ అమాయకులైన నాయకులను పార్టీ తప్పు పట్టదు, తిరిగి పార్టీ స్వాగతిస్తుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read : Weight Loss : అటుకులను ఇలా తీసుకుంటే.. త్వరగా బరువు తగ్గుతారు తెలుసా?