జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. దోనుర్, సింగందొడ్డి, లాఖ్య తండా, మంగళిగడ్డ తండా, మోత్కూలకుంటా తండా మీదుగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారం కొనసాగుతుంది. ప్రజల అపూర్వ స్వాగతానికి ధన్యవాదాలు తెలుపుతూ.. మహిళలతో కోలాటం ఆడుతూ ఆయన ముందుకు సాగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మరొక్కమారు అవకాశం కల్పించాలని కోరుతూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి కోరారు.
Read Also: Kerala: కేరళ ఆర్థిక సంక్షోభం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు
అలాగే, మిడ్జిల్ మండలంలోని రాయినోనికుంట తండా సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో పని చేస్తున్న కూలీలతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముచ్చటించారు. వారితో మాట్లాడుతూ కూలీల సాధక బాధకాలను తెలుసుకున్నారు. తెలంగాణ వచ్చాకే నీళ్లు కరెంటుకు సౌలతులు పెరగడంతో వ్యవసాయం మంచిగా అయిందని.. తమలాంటి కూలీలకు కూడా బాగా డిమాండ్ పెరిగిందని ఎమ్మెల్యేకి సదరు వ్యవసాయ కూలీలు చెప్పుకొచ్చారు. నీళ్లకు కరెంటుకు ఇబ్బంది లేకుండా చేసింది కేసీఆర్ ప్రభుత్వమే.. మరోసారి కారు గుర్తుకే ఓటేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూలీలను కోరారు.