NTV Telugu Site icon

MLA Kunamneni: కర్రెగుట్టలో కూంబింగ్‌ నిలిపివేసి.. శాంతి చర్చలు జరపాలి..

Kunamneni

Kunamneni

MLA Kunamneni: శాంతి చర్చలకు సిద్దమని మావోయిస్టులు పదే పదే ప్రతిపాదనలు పంపిస్తున్నప్పటికీ ఛత్తీస్ ఘడ్ సరిహద్దులోని కర్రెగుట్టలో భద్రతా దళాలు కూంబింగ్‌ నిర్వహించడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తక్షణమే కర్రెగుట్ట అడవులలో కూంబింగ్‌ నిలిపివేసి.. మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలకు అంగీకరించాలని డిమాండ్ చేశారు. వేలాది మంది సాయుధ బలగాలు చుట్టుముట్టి మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా మారణ హోమం చేయడం సరైన చర్య కాదని ఎమ్మెల్యే కూనంనేని అన్నారు.

Read Also: Kasthuri : రాత్రి 9 దాటిందంటే చాలు దానిపై మనసు లాగేస్తోంది..

ఇక, అణచివేత ఒక్కటే మార్గం కాదని వాటిని చర్చల ద్వారా పరిష్కరించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. తాము శాంతి చర్చలకు సిద్దమని మావోయిస్టులు మరోసారి చేసిన ప్రతిపాదనను పెడచెవిన పెట్టడం శ్రేయస్కరం కాదని సూచించారు. ఇప్పటికే మావోయిస్టులు పదుల సంఖ్యలో హతమైనట్లు వార్తలు వస్తున్నాయి.. అలాగే, సాయుధ బలగాలు వడదెబ్బకు గురైనట్లు సమాచారం వస్తుంది.. వీటన్నింటిని పరిగణలోకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు.