మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా ఉన్నారు. పొదిలి మండలంలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభోత్సవం చేశారు. మండలంలోని కుంచేపల్లి పంచాయితీ పరిధి ఉన్న గురువాయపాలెం నుంచి దాసర్లపల్లి వరకు ఒక కోటి 45 లక్షల రూపాయల సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. దాదాపు 42 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం.. 22 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాలను ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ప్రారంభించారు.
Read Also: Tirupathi: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం
ఇక, 20 లక్షలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ భవనంతో పాటు పాములపాడులో జలజీవన్ మిషన్లో భాగంగా 67 లక్షల రూపాయలతో ఇంటింటికి కొలాయిని కూడా మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. 16 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రంథాలయ నూతన భవనంతో పాటు 17 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ మిల్క్ సెంటర్ బిల్డింగ్ ను కూడా ప్రారంభించారు. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన విలేజ్ క్లీనింగ్ సెంటర్ భవనం.. 22 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు.. మొత్తంగా రెండు పంచాయతీలల్లో కలిపి నాలుగు కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ప్రారంభించారు.