KP Nagarjuna Reddy: ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ రోజు వందలాది మంది మహిళలకు పెరటి కోళ్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.. మార్కాపురంలో ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి నేతృత్వంలో.. డీఆర్‌డీఏ వైఎస్‌ఆర్ క్రాంతి పథకంలో భాగంగా వైఎస్సార్ పెరటికోళ్ల పంపిణీ, కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెరటికోళ్లను, కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొని పెరటికోళ్లు, కుట్టు మిషన్లు, కత్తెర్లు అందుకున్న మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యే కేపీ నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.. స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు.. అధికారులు హాజరై ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.. కాగా, నిత్యం అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి..