NTV Telugu Site icon

MLA KP Nagarjuna Reddy: రైతుల సంక్షేమానికి సీఎం జగన్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు..

Markapuram

Markapuram

MLA KP Nagarjuna Reddy: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతుల సంక్షేమానికి సీఎం జగన్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి వెల్లడించారు. శుక్రవారం మార్కాపురం ఏఎంసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఛైర్మన్‌గా డాక్టర్ షంషేర్ అలీబేగ్, వైస్ ఛైర్మన్‌గా మురళీ, డైరెక్టర్లుగా పిన్నిక లక్ష్మీప్రసాద్ యాదవ్, డాక్టర్ మక్బుల్ బాషా, ఇల్లూరి శారద, తూంపాటి ఆంజనేయులు, పేరూరి లక్ష్మీదేవి, షేక్ నూర్జహాన్, ఓర్సు పత్తెమ్మ, వేశపోగు రాజు, కోల వసంతకుమారి, శ్రీరామ్ అక్కమ్మ, చక్క సత్యనారాయణ, ఊటుకూరి సురేష్, కర్నా రమాదేవీలతో యార్డు సెక్రటరీ కోటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు గిట్టుబాటు ధర కల్పించారని పేర్కొన్నారు. నూతన పాలక మండలి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Read Also: Tehsildar Ramanaiah Case: తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో కీలక ఆధారాలు

మార్కెట్ యార్డు ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని నూతన చైర్మన్ షంషేర్‌ అలీబేగ్ అన్నారు. ఎమ్మెల్యే కేపి నాగార్జున రెడ్డి సహకారంతో మోడల్ ఏఎంసీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మార్కెట్ యార్డులో రూ.78 లక్ష లతో నూతన ఏఎంసీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కేపీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సి పల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, ఎమ్మెల్యే సోదరుడు కృష్ణమోహన్‌ రెడ్డి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ మేడా బద్రీనాథ్, ఎస్ఆర్సీ లేబ రేటరీస్ ఎండీ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, ఎంపీపీ అరుణా చెంచిరెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీ రమాదేవి, పార్టీ ప్రధాన కార్యదర్శులు బి.శేషయ్య, పత్తి రవిచంద్ర, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి నూతన ఛైర్మన్‌ షంషేర్‌ అలీబేగ్ ఘనంగా సన్మానించారు.